గుంటూరు ఎంపీ స్థానంపై న్యాయపోరాటం చేస్తాం
28 May, 2019 11:30 IST
అమరావతి: గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించ లేదని ఆరోపించారు. ఆర్వో అక్రమానికి పాల్పడి టిడిపి 4200 తో గెల్చినట్టు ప్రకటించారని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ట్విట్ చేశారు.