చిరంజీవికి సిగ్గు ఉందా?: గోనె ప్రకాశరావు
10 Sep, 2012 01:37 IST
‘వీహెచ్ నిర్వహించిన మేధోమథనం సదస్సులో చిరంజీవి అధిక ప్రసంగం చేశారు. తినేది ఇక్కడ, పాడేది అక్కడ అంటూ పరోక్షంగా వైయస్‌ఆర్ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఢిల్లీలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌లోని వైయస్ అభిమానులను అన్నట్టుగా అర్థమవుతోంది. కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి, మంత్రి స్థాయికి తీసుకొచ్చాడని వాళ్లకు కృతజ్ఞత ఉంది కాబట్టే వైయస్ డైరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు నీకు సిగ్గూ లజ్జా ఉందా అని అడుగుతున్నా. ఇక్కడ కూలీనాలీ చేసి నీకు టికెట్ల రూపంలో డబ్బులిస్తే.. చెన్నై అకౌంట్ ద్వారా ఆదాయపు పన్ను కడుతున్నావ్. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడితే ఎలా? సొంత జిల్లాలోని పాలకొల్లులో గెలవలేదు. తిరుపతిలో రాజీనామా చేశాక అక్కడా గెలిపించలేదు. నువ్వు విమర్శలు చేస్తావా’ అని దుయ్యబట్టారు.
‘వీహెచ్‌కు ఓ మంచి మిత్రుడిగా సవాలు చేస్తున్నా. గతంలో నువ్వు పోటీచేసిన నియోజకవర్గాల్లో పోటీ చెయ్యి. ఒక్క చోటైనా గెలువు. అలా గెలిస్తే నీ దగ్గర అటెండర్‌గా పనిచేస్తా..’ అని గోనె సవాల్ చేశారు.