వైయస్ జగన్ పాదయాత్ర ఓ అద్భుతం...
1 Dec, 2018 12:08 IST
శ్రీకాకుళంః ప్రవాసాంధ్రులు, వైయస్‌ఆర్‌సీపీ వైద్య విభాగం ప్రతినిధులు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను కలిశారు. జగన్ పాదయాత్ర రాజకీయాల్లోనే ఓ అద్భుతం అని ప్రవాసాంధ్రుడు ఆనంద్ పేర్కొన్నాడు. వైయస్ జగన్‌ను కలిసేందుకు గతంలో రెండుసార్లు అమెరికా నుంచి వచ్చినా సాధ్యం కాలేదని, చివరిగా శ్రీకాకుళం జిల్లాలో పాదయ్రాతలో జగన్‌ను కలవడం సాధ్యమైందన్నారు. ప్రవాసాంధ్రులంతా వైయస్ జగన్ విజయాన్ని కాంక్షిస్తున్నారు.జననేతను కలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు.