45వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

26 Dec, 2017 19:00 IST

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 45వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్‌పీ కుంట మండలంలోని  నంబులపూల కుంట నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి దిగువతువ్వ పల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారి పల్లి, పాపన్నగారి పల్లె వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. తిరిగి 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పెడ బలిజ, బలిజ పల్లి వరకు ప్రజా సంకల్ప యాత్ర సాగుతోంది. సాయంత్రం 6 గంటలకు 45వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.