జననేత బస శిబిరం బురదమయం

15 Jul, 2018 13:46 IST
తూర్పుగోదావరి: ప్రజల కోసం మొక్కవోని దీక్షతో ఎదురైన కష్టాలన్నింటినీ బరిస్తూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాపోరాటం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో వైయస్‌ జగన్‌ బస చేసే శిబిరం మొత్తం బురదమయమైంది. గొల్లల మామిడాల ప్రాంతంలో వైయస్‌ జగన్‌ బస శిబిరం ఏర్పాటు చేశారు. కాగా వర్షం కారణంగా 213వ రోజు ప్రజా సంకల్పయాత్రకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. జననేతను కలుసుకునేందుకు అనపర్తి నియోజకవర్గ ప్రజల వానలో సైతం వేలాదిగా తరలివచ్చారు. వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు కూడా వర్షానికి పూర్తిగా తడిసిపోయారు. వర్షంతో అంతరాయం ఏర్పడడంతో శిబిరంలో వైయస్‌ జగన్‌ ప్రజలను కలుస్తున్నారు.