సమస్యలపై వైయస్‌ జగన్‌కు వినతిపత్రాలు

8 May, 2018 15:58 IST

కృష్ణ: ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని అంగన్‌వాడీ వర్కర్లు వైయస్‌ జగన్‌తో గోడు వెల్లబోసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తాము ఎదుర్కుంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం అందించడం లేదని చెప్పుకున్నారు. అదే విధంగా దివంగత మహానేత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దివ్యాంగులు వాపోయారు. పీఆర్‌సీ పరిధి నుంచి తమను తొలగించారని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.