సబ్బవరం జనసంద్రం
5 Sep, 2018 16:36 IST
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో జనసంద్రంగా మారింది. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పాదయాత్రగా పట్టణంలోకి వచ్చిన వైయస్ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొద్ది సేపటి క్రితమే జననేత 2900 కిలోమీటర్ల మైలు రాయిని దాటి, బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు.