పోటెత్తిన కొత్తవలస
24 Sep, 2018 16:41 IST
విజయనగరం: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొద్ది సేపటి క్రితం కొత్త వలస చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటిని సందర్భంగా దేశపాత్రునిపాలెం వద్ద వైయస్ జగన్ పైలాన్ ఆవిష్కరించారు. కొత్త వలస వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం పోటెత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.