బండ్లవారిపాలెంలో సమస్యల వెల్లువ
17 Mar, 2018 11:12 IST
గుంటూరు: ప‌్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ దృష్టికి పలు సమస్యలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా బండ్లవారిపాలెంలో స్థానికులు తమ సమస్యలు వైయస్ జగన్‌కు వివరించారు. తాగడానికి మంచినీరు కరువైందని, సాగునీరు అసలే లేదని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని ధైర్యం చెప్పారు.