ప్రజా సంకల్ప యాత్ర 262వ రోజు షెడ్యూల్‌

14 Sep, 2018 18:01 IST

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 262వ షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నగరంలోని రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, ఫైన్‌ ఆపిల్, దారాపాలెం వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం అడవివరం జంక్షన్, లండగరువు క్రాస్, దువ్వాపాలెం క్రాస్‌ వరకు సాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.