ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్
29 Jan, 2018 17:51 IST
నెల్లూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన వెంటకగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక‍్కనదాల క్రాస్, ఊటకూరు, గిద్దలూరు క్రాస్, తురిమెళ్ల, కలిచేడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ తురిమెళ్లలో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అలాగే కలిచేడులో చేనేతలతో ముఖాముఖి అవుతారు. వైయస్ జగన్ రాత్రికి కలిచేడులోనే బస చేస్తారు.