శిఖబడి క్రాస్ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
24 Nov, 2018 09:39 IST
విజయనగరం: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయ నగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి బి.జె.పురం, గెడ్డతిరువాడ మీదుగా ఇటికకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం కుందర తిరువాడ క్రాస్, చినకుదమ క్రాస్ మీదుగా తురకనాయుడువలస వరకు సాగుతోంది.
విజయనగరం జిల్లాలో గడచిన రెండు నెలలుగా పాదయాత్ర కొనసాగుతోంది. జననేతను చూసిన ప్రతి పల్లె నిలువెల్లా పులకిం చింది. తొమ్మిది నియోజకవర్గాల్లో వేలాది బాధితులు తమ కష్టాలను కలబోసుకున్నారు. సమస్యలను నివేదించారు. వినతులు అందించారు. వారందరి వేదన కూలంకషంగా తెలుసుకుని మరికొద్ది రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని వైయస్ జగన్ భరోసా కల్పిస్తున్నారు.