విజయవాడలో కొనసాగుతున్న పాదయాత్ర

14 Apr, 2018 16:18 IST

విజయవాడ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవాడ నగరంలో కొనసాగుతోంది. వేలాదిగా జనం వెంట రాగా నగరంలోని వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.  అశేష జనం మధ్య వైయస్‌ జగన్‌ కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు. కృష్ణమ్మ వారధి నుంచి వేలాదిగా వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారు. ఎ్రరటి ఎండను లెక్క చేయకుండా జనం జననేత కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం చిట్టి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.