వీరఘట్టంలో కొనసాగుతున్న వైయస్ జగన్ పాదయాత్ర
26 Nov, 2018 15:16 IST
శ్రీకాకుళం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామం తరువాత వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. విక్రమపురం గ్రామ రజకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఆదరణ పథకం కింద ఎలాంటి పనిముట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల సమస్యలను జననేత సావధానంగా విన్నారు.