119వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

23 Mar, 2018 16:46 IST
గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 119వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం వైయస్‌ జగన్‌ చిలకలూరిపేట మండలంలోని బస ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఉదయం 8 గంటలకు కొమిటినేని వారి పాలెం, గంగన్న పాలెం, 9 గంటలకు ఇర్లపాడు, 9.30 గంటలకు మినాసాహేబ్‌ పాలెం, 10 గంటలకు బాసిక్‌ పాలెం వరకు పాదయాత్ర సాగుతుంది. 11 గంటలకు మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతోంది. నరసరావుపేట మండలం బాసిక్‌ పాలెం నుంచి మొదలయ్యే పాదయాత్ర కేశానుపల్లి మీదుగా నరసరావుపేటకు చేరుకుంటుంది. నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.