209వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

9 Jul, 2018 09:19 IST

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 209వ రోజు ప్రారంభమైంది. ప్రజాసమస్యల పోరాడుతూ వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర సోమవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి ప్రారంభమైంది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజల సమక్షంలో జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సోమేశ్వరం, సీతమ్మ తోట, లొల్ల గ్రామం మీదుగా రాయవరం  వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం రాయ‌వ‌రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగిస్తారు.