చిరుజల్లుల మధ్యే వైయస్ జగన్ పాదయాత్ర
7 Jul, 2018 11:32 IST
తూర్పు గోదావరి: ప‌్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం రామచంద్రాపురం నియోజకవర్గంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షంలోనే వైయస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జననేతకు ఘన స్వాగతం లభిస్తోంది. జగన్నాయకపాలెం శివారు నుంచి వైయస్ జగన్ ప్రజాసంకల్పయత్ర ప్రారంభించారు.