ఉపాధి బిల్లులు చెల్లించడం లేదు

15 Nov, 2017 14:33 IST
ఆళ్లగడ్డ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన బిల్లులు మంజూరు చేయడం లేదని ఆర్‌. కృష్ణాపురం గ్రామ వ్యవసాయ కూలీలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పనులు లేక వలసలు వెళ్తున్నామని, గ్రామంలో మంచినీటి సమస్య ఉందని, పొదుపు రుణాలు మాఫీ కాలేదని మహిళలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థ‌లాలు లేవ‌ని, పక్కా ఇల్లు మంజూరు చేయ‌డం లేద‌ని వాపోయారు.