జోరువర్షంలోనూ కొనసాగిన వైయస్ జగన్ పాదయాత్ర
24 Aug, 2018 17:40 IST
–2800 కి.మీ మైలురాయి దాటిన గుర్తుగా వేపమొక్క నాటిన వైయస్ జగన్
విశాఖ: జోరు వర్షంలోనూ జననేత వైయస్ జగన్ పాదయాత్రను కొనసాగించారు. 2800 కి.మీ మార్క్ దాటి యలమంచిలిలో ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించింది. వేలసంఖ్యలో ప్రజలు ఆయన అడుగులో అడుగులేస్తూ యలమంచిలి చేరుకున్నారు. యలమంచిలి కోర్టు సమీపంలో వైయస్ జగన్ 2800 కి.మీ మైలురాయిని దాటారు. ఈ సందర్భంగా అక్కడ వేపమొక్కను నాటి పాదయాత్రను ముందుకు కొనసాగించి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.