319వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
10 Dec, 2018 18:47 IST
శ్రీకాకుళంః జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 319వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు.మంగళవారం ఉదయం శ్రీకాకుళం బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.నాదలపురం,చింతాడ,బ్రిడ్జి రోడ్డు సెంటర్ వరుకు సాగుతుంది. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం ఆమలదాలవలస మీదగా పాదయాత్ర కొనసాగుతుంది. కాలేజీ రోడ్డులో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారని తలశీల రఘురాం తెలిపారు.