307వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

26 Nov, 2018 18:51 IST

శ్రీకాకుళం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 307వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం వైయస్‌ జగన్‌ పాలకొల్లు నియోజకవర్గంలోని వీరఘట్టం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రేగులపూడి క్రాస్, తుడి క్రాస్, బొడ్లపాడు క్రాస్‌ మీదుగా వందువా క్రాస్‌ వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నవగం క్రాస్, నీలనగరం క్రాస్, పనుకు వలస, తలవరం క్రాస్‌ మీదుగా అట్టలి క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తలశీల రఘురాం వివరించారు.