303వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
20 Nov, 2018 18:32 IST
విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 303వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మ వలస మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి దాసరి పేట, తళ్లడుమ్మ, చిన్న మేరంగి, అల్లువాడ వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభమై..పెద తుంబిలి, చిన్న తుంబిలి, జోగులదుమ్మ, షేక్‌బడి క్రాస్ వరకు పాదయాత్ర సాగుతోందని రఘురాం పేర్కొన్నారు.