293వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

23 Oct, 2018 17:34 IST

విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో వియవంతంగా కొనసాగుతోంది. 293వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ విడుదల చేశారు. బుధవారం ఉదయం సాలూరు మండలంలోని నైట్‌ క్యాంపు నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతోంది.  అక్కడి నుంచి సన్యాసిరాజు పేట, బాగువలస, నక్కడ వలస క్రాస్‌ వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తాడిలోవా,మక్కువ మండలంలోని గునికొండ వలస, దేవబూచమ్మ పేట వరకు పాదయాత్ర సాగుతుంది.