ప్రజా సంకల్ప యాత్ర 277వ రోజు షెడ్యూల్‌

2 Oct, 2018 17:36 IST

విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 277వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం నెల్లమర్ల నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి జరజపుపేట, లక్ష్మీదేవి పేట వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. నెల్లిమర్ల, మొయిదా జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.