పాదయాత్రకు విరామం
24 Dec, 2018 18:49 IST
క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎయ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు మంగళవారం విరామం ప్రకటించారు. క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవడానికి వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం చాపర గ్రామం పాదయాత్ర శిబిరంలోనే జననేత ఉంటారు. బుధవారం ఉదయం. తిరిగి పాదయాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.