నేడు పార్వతీపురంలో వైయస్ జగన్ బహిరంగ సభ
17 Nov, 2018 11:51 IST
విజయనగరం: ఒకటి కాదు.. వంద కాదు.. వేల సంఖ్యలో అడుగులన్నీ ఏకమవుతున్నాయి. పల్లెలు కదలివస్తుండగా.. చిన్న చిన్న పట్టణాలు తరలివస్తున్నా యి. తమ అభిమాన నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్నాయి. జననేత రాకతో పాదయాత్ర దారులన్నీ జన ప్రవాహంతో నిండిపోతున్నాయి. చిన్నా.. పెద్దా... ముసలీ.. ముతకాతో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వారు సైతం జననేత చేయి చేయి కలిపి ప్రజా సంకల్పయాత్రలో భాగస్వాములవుతున్నారు. తమ సమస్యలను వినేందుకు వచ్చిన రాజన్న బిడ్డకు నీరాజనం పలుకుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు సైతం రహదారిపై జననేత కోసం అతృతగా ఎదురు చూశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పో టీ పడుతున్నారు. అధిక సంఖ్యలో యువకులు, మహిళలు ఆయనతో అడుగేస్తుండటం విశేషం. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఉదయం 7.30 గంటలకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం సూరంపేట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నర్సిపురం, వసుంధరనగర్, యర్రా కృష్ణమూర్తి కాలనీవరకూ సాగుతుందని తెలిపారు. తిరిగి మధ్యాహ్న భోజనానంతరం పార్వతీపురం పాతబస్టాండ్ జంక్షన్ వరకు చేరుకుని అక్కడే బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగిస్తారు. హత్యాయత్నం నుంచి బయటపడి... మృత్యుంజయుడై వచ్చిన ఆయన ప్రజాసంకల్ప యాత్రలో నాలుగు రోజులుగా పాల్గొంటున్నా... ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య లూ చేయలేదు. ఇక మిగిలింది పార్వతీపురంలో బహిరంగ సభ. అక్కడ ఏం మాట్లాడతారో... ఏం ప్రకటన చేయబోతున్నారో...ఆయన నిర్ణయం ఏమై ఉంటుందోనన్న ఆత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇన్నాళ్లూ తనపై జరిగిన హత్యాయత్నంగురించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఇప్పుడు బహిరంగ సభలో ఏం మాట్లాడుతారోనని అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.