జననేతను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ

18 May, 2018 13:01 IST
పశ్చిమగోదావరి: గురువులనే గౌరవం లేకుండా కలెక్టర్‌ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జేఏసీ నేతలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ తమ సమస్యలు చెబితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. అదే విధంగా సీపీఎస్‌ రద్దు చేయాలని వినతిపత్రం పేర్కొన్నారు.