జననేతను కలుసుకున్న శ్రీశయన కులస్తులు

17 Dec, 2018 11:15 IST

శ్రీకుకుళం ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేతకు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. సోమవారం ఉదయం రావాడ పేట వద్ద శ్రీశయన కులస్తులు కలుసుకుని బిసిల్లో ఉపకులంగా ఉన్న తమకు ప్రబుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. తమ కులానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ చేసి ఆదుకోవాలని కోరుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.