జననేతను కలిసిన సాప్ట్‌బాల్ క్రీడాకారులు
21 Oct, 2018 12:18 IST
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని
సాప్ట్‌బాల్ క్రీడాకారులు కలుసుకుని తమ సమస్యలు విన్నవించుకున్నారు. గ్రౌండ్‌లు సరిగాలేవని సొంత ఖర్చులతోనే క్యాంప్‌లకు వెళ్ళాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. స్పాన్సర్లు ముందకు రావడంలేదన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులకు ప్రోత్సహం ఇస్తామని జననేత భరోసా ఇచ్చారు.