జననేతను కలుసుకున్న శిష్ట కరణాలు

20 Dec, 2018 11:04 IST

శ్రీకాకుళం తమ సమస్యలను పరిష్కరించాలను కోరుతూ సంతబొమ్మాళి మండలంలో శిష్టకరణ కులస్తులు ప్రతిపక్ష నాయుకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. దివంగత మహానేత వైయస్ హయాంలో తమను ఓసీ కేటగిరీ నుంచి బీసీ డి లోకి చేర్చారని అయితే తమను ఓబిసీలుగా గుర్తించక పోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఇతరత్రా అవకాశాల్లోని తగిన న్యాయం జరగట్లేదని వారు వాపోయారు. వీరి సమస్యను సావకాశంగా విన్న జననేత పరిష్కారానికి చొరవ చూపుతానంటూ భరోసా ఇచ్చారు.