మినీ రిజర్వాయర్‌ నిర్మించాలన్నా..

25 Nov, 2018 14:56 IST
విజయనగరంః వంగెర గెడ్డ వద్ద మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని శాంకేతపురం  గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.రిజర్వాయర్‌ను నిర్మిస్తే నాలుగువేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కొలతలు వరుకే పరిమితమయిందన్నారు. ఒక అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. తాగునీటికి ఉపయోగపడే అవకాశముందన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వాయర్‌ నిర్మిస్తారనే నమ్మకం ఉందని గ్రామస్తులు అన్నారు.