రెండో రోజు పాదయాత్ర ప్రారంభం
7 Nov, 2017 09:46 IST
వేంపల్లి:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకు వైయస్ఆర్ జిల్లా వేంపల్లి శివారు నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముందుకు కదిలారు. జననేతతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. రోడ్ల వెంట వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూ..తమ సమస్యలు చెప్పుకున్నారు.