181వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

4 Jun, 2018 19:04 IST
 
పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 181వ రోజు షెడ్యూల్‌ వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ విడుదల చేశారు. మంగళవారం ఉదయం తణుకు నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభవుతుంది. వేల్పురు, వీరభద్రాపురం వరకు సాగుతుంది. మధ్యాహ్నభోజన విరామం అనంతరం తణుకు పట్టణానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.