రాజాం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్పయాత్ర
1 Dec, 2018 13:10 IST
శ్రీకాకుళంః రాజాం నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంకిలి వద్ద నాగావళి నది వంతెనపై పార్టీశ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.వైయస్ జగన్ పాదయాత్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలు వైయస్ జగన్ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు.