బాప‌ట్ల శివారు నుంచి 111వ రోజు పాద‌యాత్ర‌ ప్రారంభం

13 Mar, 2018 11:00 IST
 గుంటూరు :  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 111వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మం‍గళవారం ఉదయం ఆయన బాపట్ల శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. బాపట్ల మూర్తి రక్షణ నగరం, కొండుబొట్లవారి పాలెం క్రాస్‌, అప్పికట్ల, పూండ్లక్రాస్‌ మీదగా ఈతేరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈతేరులో వైయ‌స్‌ జగన్‌...ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ 1,484.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.