ఈపురుపాలెం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
12 Mar, 2018 10:14 IST
ప్రకాశం : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 110వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన ఈపురుపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి బేతపూడి, వెదుళ్లపల్లి, వడ్డేపాలెం, మహాత్మాజీపురం మీదగా బాపట్ల వరకూ కొనసాగనుంది. మహాత్మజీపురంలో ప్రజలతో వైయస్ జగన్ మమేకం అవుతారు. బాపట్లలో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ వైయస్ జగన్ 1,472.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.