ప్రారంభమైన పాదయాత్ర

26 Dec, 2018 08:29 IST

శ్రీకాకుళం ; ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 331 రోజు నాటి పాదయాత్ర పాతపట్నం నియోజకవర్గం మిళియాపుట్టి మండలంలో జరుగుతోంది. కొద్ది సేపటి క్రితం చాపర గ్రామంలోని నైట్ క్యాంపు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పట్టుపురం, జోడూరు క్రాస్ వైపుగా సాగుతోంది. ఈ సందర్బంగా అనేక మంది ప్రజలు తమ సమస్యలు జననేతతో పంచుకోడానికి బారులు తీరారు.