ప్రారంభమైన 107వ రోజు ప్రజా సంకల్పయాత్ర
8 Mar, 2018 10:17 IST
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా నిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు వైయస్ జగన్ తన 107వ రోజు పాదయాత్రను సంతరావురు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ కాలనీ మీదుగా వేటపాలెం వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననేతకు తోడుగా ఆయన అడుగులో అడుగులేస్తున్నారు.