జననేతను కలిసిన మామిడి రైతులు
8 Oct, 2018 14:44 IST
విజయనగరం: మామిడికి మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విజయనగరం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తరువాత చేతికొచ్చే పంట చెత్తకుప్పల పాలు చేసుకుంటున్నామని, అరకొర ధరకు అమ్ముకుంటూ అప్పుల పాలవుతున్నామని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మామిడి రైతులు కలిశారు. కోల్డ్ స్టోరేజ్‌తో పాటు మద్దతు ధర కల్పించాలని కోరారు. అదే విధంగా దళారుల జోక్యాన్ని నివారించాలని జననేతకు వివరించారు.