టీడీపీ ప్రచారమే తప్ప..ఎవరినీ ఆదుకోలేదు..
31 Dec, 2018 13:20 IST
శ్రీకాకుళంః వైయస్ జగన్‌ను కలిసి జీడి పరిశ్రమ కార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నారు.కూలీకి వెళ్తామంటే పంటలేదని, ఇంట్లో ఉందామంటే అవి తూపాన్ దాటికి ఎగిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.తిత్లీ తుపాను బాధితులకు సాయం చేశామని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఎవరినీ ఆదుకోలేదని కార్మికులు వాపోయారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బాధితులను ఆదుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు.