జగన్‌ మావయ్యకు పిల్లలంటే ఎంతో ఇష్టం..

2 Jan, 2019 12:11 IST

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో తమ అభిమాన జననేత  వైయస్‌ జగన్‌ను కలిసేందుకు చిన్నారుల నుంచి వృద్ధులు వరుకూ పోటీపడుతున్నారు.హరిపురానికి చెందిన చిన్నారి గ్రీష్మ వైయస్‌ జగన్‌ను కలిసింది.జగన్‌ మావయ్యను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఉబ్బితబ్బివుతోంది.చిన్నతనంలో షర్మిలమ్మను పాదయాత్రలో కలిశానని,నేడు వైయస్‌ జగన్‌ను కలవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

నెహ్రూకు,వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తాతకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, అదేవిధంగా వైయస్‌ జగన్‌ మావయ్యకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టమని తెలిపింది.