మరికొద్ది సేపట్లో గుర్లలో వైయస్ జగన్ బహిరంగ సభ
7 Oct, 2018 15:26 IST
సభాస్థలికి తరలివస్తున్న ప్రజలు...
మండల కేంద్రంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాలు రెపరెపలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో మరికొద్ది సేపట్లో వైయస్ జగన్ బహిరంగ సభ జరుగనుంది. వేలాది మంది ప్రజలు బహిరంగ సభకు తరలివస్తున్నారు. వైయస్ జగన్ భారీ ప్లెక్సీలు, కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్ హయాంలో 95 శాతం పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టు టీడీపీ పాలనలో ముందుకు సాగలేదన్నారు. గుర్ల మండల కేంద్రంలో డిగ్రీ కాలేజిని ఏర్పాటు చేస్తాని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను వైయస్ జగన్ ప్రస్తావిస్తారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.