హెచ్.కైరవడిలో ఘన స్వాగతం
28 Nov, 2017 12:39 IST
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని హెచ్.కైరవడి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. వైయస్ జగన్ 20వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం పుట్టపాశం నుంచి ప్రారంభం కాగా కైరవడి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఊరు ఊరంతా కదలివచ్చి జననేత వెంట నడిచారు. తమ బాధలు చెప్పుకున్నారు. సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. మరో ఏడాది ఓపిక పట్టండి అంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.