పాదయాత్ర మార్గంలో పండుగ సందడి

14 Oct, 2018 13:25 IST

గజపతి నగరంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆదివారం నాటి పాదయాత్రలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు. అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు కదులుతున్నారు. ఆయన రాకతో  పలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. జననేతను కలుసుకునేందుకు స్థానికులు, ముఖ్యంగా మహిళలు బారులు తీరారు.