వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు

9 Apr, 2018 15:41 IST

గుంటూరు: ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మంగళగిరి నియోజకవర్గంలో రైతులు కలిశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. శనగలకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మరో ఏడాదిలో దిగిపోతున్నానని రైతులను పట్టించుకోవడం లేదని ఆన్నదాతలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.