322వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
15 Dec, 2018 18:25 IST
శ్రీకాకుళం: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 322వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం వైయస్ జగన్ నరసన్నపేట నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొమర్తి, గుండువిల్లిపేట, సత్యవరం క్రాస్ వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నరసన్నపేట పట్టణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జమ్ము వరకు పాదయాత్రను కొనసాగిస్తారు.