‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

6 Jan, 2019 10:17 IST

శ్రీ‌కాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’  పుస్తకాన్ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవిష్కరించారు. ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి, తమ్మినేని సీతారాం, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గం సమన్వయకర్త పరియా సాయిరాజ్‌, పాతపట్నం నియోజకవర్గం సవన్వయకర్త రెడ్డి శాంతిలు పాల్గొన్నారు.