ఇంటికో ఉద్యోగమంటూ మోసం చేశారు
14 Oct, 2018 13:16 IST
గజపతి నగరం: ఇంటికో ఉద్యోగం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైయస్ జగన్‌ను కలిసిన దివ్యాంగుడు అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరద్యోగిగా మిగిలిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గజపతి నగరంలో పాదయాత్ర చేస్తున్న జననేతను కలుసుకుని తమ కష్టాలను వెలిబుచ్చుకున్నారు.