ఆరోగ్యశ్రీ అమలు చేయడం లేదు
29 Sep, 2018 15:11 IST
విజయనగరం: చంద్రబాబు పాలనలో అరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆరోగ్యశ్రీ బాధితులు కలిశారు. ఎనిమిది నెలలైనా సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదని బాధితులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.