అగ్రిగోల్డ్‌కు డబ్బుకట్టి మోసపోయామన్నా..
3 Oct, 2018 12:45 IST
న్యాయం జరిపించాలని జననేతను కలిసిన మహిళలు
విజయనగరంః రోజుకూలీ చేసుకుని బతికే తాము అగ్రిగోల్డ్‌కు డబ్బులు కట్టి మోసపోయాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కొండవెలగాడలో వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. పిల్లల చదువుకోసం, ఇంటి కోసం ఉన్న డబ్బంతా కట్టామని మహిళలు వాపోయారు. తమకు న్యాయం జరిపించాలని జననేతను కోరారు.టీడీపీ ప్రభుత్వం డబ్బులు ఇప్పించకుండా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోనే అగ్రిగోల్డ్ బాధితులు అ«ధికంగా ఉన్నామని, అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. వైయస్ జగన్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.